Mahaa Daily Exclusive

  ఆపరేషన్ ముస్కాన్ తో 177 చిన్నారులకు విముక్తి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..!

Share

హన్మకొండ మహా;

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు
ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 177 చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. గత గత నెల జులై మొదటి తారీఖు నుండి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బాల కార్మికులు, బడి మానేసిన 177 మంది బాల బాలికలను గుర్తించి వారిని బాలల సంరక్షణ గృహానికి తరలించారు. ఇందులో 149 మంది బాలలు, 28 మంది బాలికలు ఉన్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు 97మంది చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ తనిఖీల్లో గుర్తించిన 177 చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇక పై
ఈ తనిఖీలు కొనసాగుతాయని ఎవరైనా చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకునే యాజమానుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పై బాలల న్యాయ చట్టం అనుసరించి చిన్నారులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50వేల రూపాయల జరిమాన విధించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.