Mahaa Daily Exclusive

  రెండు పడక గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

Share

వరంగల్ మహా;

వరంగల్ పట్టణంలోని 3వ డివిజన్ పైడిపల్లి లోని రెండు పడక గదుల భవన సముదాయాన్ని వరంగల్
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ లలో ఆర్ అండ్ బి శాఖచే చేపడుతున్న మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, ఎలక్ట్రికల్ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరమ్మత్తు పనులు వేగవంతంగా పూర్తి చేసి దివ్యంగ లబ్ధిదారులకు అందించుటకు సిద్ధం చేయాలనీ అన్నారు. బల్దియా ఆధ్వర్యంలో నిర్మించిన అంతర్గత రోడ్డును కలెక్టర్ పరిశీలించి, ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటి గ్రీనరిని పెంచుటకు బల్దియా ఉద్యనవనాల అధికారికి పలు సూచనలు చేశారు. ఈ ప్రాంత ప్రక్కకు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, ఎన్పిడిసిల్ ఎస్ ఈ గౌతమ్ రెడ్డి, జిల్లా ఆర్ అండ్ బి అధికారి రాజెందర్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, తహశీల్దార్ ఇక్బాల్, తదితరులు, ఉన్నారు.