Mahaa Daily Exclusive

  పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ..!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ నగరంలోని పోలీస్ కమిషనరేట్ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ దర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పుర ప్రముఖులను, స్వాతంత్య్ర సమరయోధులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి తిలకించి వివరాలను తెలుసుకున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్థులు దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను మంత్రి, జిల్లా కలెక్టర్‌, పోలీసు కమీషనర్‌, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.