Mahaa Daily Exclusive

  వాడవాడలా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్లు పలువురు ప్రముఖులు..!

Share

వరంగల్ మహా;

వరంగల్ దేశాయ్ పేట్ రోడ్డు లోని దేశాయ్ పేట్ రోడ్డు వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ లయన్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాశ్వత అధ్యక్షులు జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

డెల్టా సూపర్ 30 స్కూల్లో

కొత్తవాడలోని 80 ఫీట్ రోడ్ లో గల డెల్టా సూపర్ 30 స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డెల్టా స్కూల్ కరస్పాండెంట్ వేల్పుగొండ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ వేల్పుగొండ స్వర్ణలత తో కలిసి పతాకావిష్కరణ గావించిడం జరిగింది. ఈ సందర్భంగా ారు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది. ఇప్పటికీ 79 సంవత్సరాలు స్వేచ్ఛ భారతావనిలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలు విద్య వైద్యరంగం ఆర్థిక రంగంలో కూడా ప్రపంచం లోనే అగ్రగామిగా నిలుపుటకు భావి భారత పౌరులుగా మీరందరూ చక్కటి విద్య అభ్యసించి నాటి త్యాగమూర్తులు సాధించిన స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలని ఎందరో వీర యోధులు సాధించిపెట్టిన ఈ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకుంటూ దేశ సేవకు పునరంకితం కావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం స్కూల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు.

22వ డివిజన్ పరిధిలోని ఆయా కాలనీ లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ముఖ్య నాయకులు, డెల్టా స్కూల్
ఇంచార్జి టీచర్స్, టి సునీత.
అమృత రాణి
శైలజ, శ్రీనివాస్, విద్యార్థినీ విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.