కాటారం, మహా :
కాటారం మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ చేయూతనిచ్చింది. శుక్రవారం 105 మంది విద్యార్థిని విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు,బెల్టులు స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ కొట్టే సతీష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల ప్రతిభను గుర్తించి తరగతి గదిలో హాజరు శాతం లో ముందు వరుసలో ఉన్న విద్యార్థుల కు బహుమతులు పంపిణీ చేసినట్లు స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ కొట్టే సతీష్ తెలిపారు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న విధంగా ప్రతి విద్యార్థికి ఐడెంటిటీ కార్డులు మరియు బెల్టులు అందజేసి గ్రామీణ నిరుపేద విద్యార్థి విద్యార్థులకు చదువుకోవడం ద్వారానే వారి భవిష్యత్తు బంగారు మయంగా మారుతుందని సంస్థ ఫౌండర్ కొట్టే సతీష్ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులను స్వయంకృషి సంస్థ సభ్యులు శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూర రమేష్, గీత ,ఈశ్వరి, నరసయ్య ,ఫణిదర్ మరియు స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.








