Mahaa Daily Exclusive

  *దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలు మరువలేనివి _జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే …!

Share

భూపాలపల్లి, మహా :

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే , సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వికరించి జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. “బ్రిటీష్ పాలన నుండి మనకు స్వాతంత్ర్యం లభించి నేటితో 78 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించింది. ఈ శుభ సందర్భంలో మన స్వాతంత్ర్య సమరయోధుల గొప్ప త్యాగాలను మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలని ఎస్పీ అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతల ప్రాముఖ్యత ముఖ్యమని “పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యత, నిబద్ధతతో పనిచేయాలనీ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలనీ, ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మన స్వాతంత్ర్యానికి నిజమైన సార్థకత లభిస్తుందనీ, అలాగే “భారతీయులుగా జన్మించినందుకు మనమందరం గర్వపడాలనీ ప్రతి ఒక్కరూ తమ విధులను అంకితభావంతో నిర్వహించి, ప్రజల మన్ననలు పొందాలి” అని ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో భూపాలపల్లి అదనపు ఎస్పీ, ఏ నరేష్ కుమార్, భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, డీఎస్పీ నారాయణ నాయక్, డిపిఓ ఏవో వసిమ్ ఫర్హాన, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.