కాటారం, మహా : మంథని నియోజకవర్గంలో ప్రజలే మా బలం.. మాకు అండ.. ప్రజల ఆశీర్వచనాలే మాకు శ్రీరామరక్ష అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు అన్నారు కాటారం మండల కేంద్రంలో శ్రీపాద ట్రస్ట్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ల ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం కాటారంలో జరిగింది.దుద్దుల శీను బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్జిల్లా శ్రీధర్ బాబు రాష్ట్ర ఉపాధ్యాయ జనాలే ముఖ్యంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తారని తద్వారా ప్రజల్లో గుర్తింపు వస్తుందని అన్నారు. పురస్కారాల కోసం మంత్రి ఎప్పుడూ ఆశపడలేదని చేసిన కృషికి ఫలితంగానే ఇండియాస్ 100 మోస్ట్ ఇన్న్ఫ్లోయెన్సియల్ పీపుల్ ఇన్ ఏ ఐ 2025 జాబితాలో చోటు లభించిందని దుద్దిల శ్రీనుబాబు పేర్కొన్నారు. మండలాల వారీగా కంటి వైద్య పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేస్తామని శ్రీను బాబు తెలిపారు
గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు చేరువ చేయడం, ముఖ్యంగా కంటి వెలుగు కోల్పోయే పరిస్థితులను నివారించడం కోసం ఇలాంటి వైద్య శిబిరాలు, ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాలు ఎంతో అవసరం” అని పేర్కొన్నారు.పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య బృందం చేస్తున్న సేవలను ప్రశంసించారు.
శ్రీపాద ట్రస్ట్ ద్వారా కంటి అద్దాలు పంపిణీ
శ్రీపాద ట్రస్ట్- పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో కాటారంలో శుక్రవారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు లబ్ధిదారులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఏప్రిల్ 13వ తేదీన కాటారంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించారు.450 మందికి శాస్త్ర చికిత్సలు చేయగా ఈరోజు 250 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. 477 మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. అంటే వైద్య శిబిరాల కార్యనిర్వాహకుడు మహేందర్ యాదవ్ను పుష్పగిరి కంటి ఆసుపత్రి డాక్టర్లు సిబ్బందిని శ్రీనివాస్ శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఎం.జి.ఆర్.జి.ఎస్ కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య , సింగిల్ విండో చైర్మన్లు సాంబయ్య ,చల్ల తిరుపతి రెడ్డి, నాయకులు బడితెల రాజయ్య,జంపయ్య,జాడి మహేశ్వరి, బన్సోడా రాణి బాయ్, తెప్పెల దేవేందర్ రెడ్డి ఓన్న వంశవర్ధన్ రావు, గద్దె సమ్మీరెడ్డి, దబ్బేట రాజేష్ కార్యకర్తలు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉచిత అన్నదానం నిర్వహించారు.








