కారేపల్లి, మహా:కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతి డైరీఫార్మ్ ను జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకులు పచ్చిపాల రాములు,గురులక్ష్మి దంపతులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.నూతన డైరీ ఫార్మ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు పచ్చిపాల వెంకట్,యుగంధర్ లను అభినందించడానికి స్నేహితులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే వ్యాపారాన్ని నిలబెడుతుందని,వారికి నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు.పశువుల ఆరోగ్యం, సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విలేకరులు కొండపల్లి వెంకటేశ్వర్లు,కొత్తూరి శ్రీనివాస్, బాదావత్ రామునాయక్,ధారావత్ కళ్యాణ్, గుగులోతు శివ,తేజావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.








