Mahaa Daily Exclusive

  సర్కార్ ధవాఖానలో ఐఏఎస్ భార్య డెలివరీ ఐ టీ డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ సింప్లిసిటీకి అభినందనల వెల్లువ …!

Share

మహా భద్రాచలం

సర్కారు ధవాఖానా కు వెళ్లాలంటేనే కొందరు భయపడతారు. అక్కడ వైద్యసేవలు సరిగా అందవనేది కొందరి అభిప్రాయం. అటువంటి వారి అభిప్రాయం తప్పు అంటూ… గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని నిరూపించారు భద్రాచలం ఐ టీ డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఐఏఎస్. తన భార్య మనీషా రాహుల్ కు పురుడు నొప్పులు రావడంతో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అడ్మిట్ చేశారు. ఫ్రీ డెలివరీ కోసం ఎదురు చూసిన వైద్యులు, కాన్పు కష్టం కావడంతో ఆగష్టు 15 శుక్రవారం ఉదయం 3.16 నిమిషాలకు ఆపరేషన్ చేయడంతో మనీషా రాహుల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒక ఐఏఎస్ అధికారి ప్రయివేట్ వైద్యాన్ని ఆసించకుండా… ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేపించిన ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ను పలువురు అధికారులతో పాటు ప్రజలు అభినందిస్తున్నారు.