దమ్మపేట, మహా.
దమ్మపేటలో ఆదివాసి నాయకుడు తంబళ్ల రవి శుక్రవారం బీజేపీలో చేరారు.
దమ్మపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించి, చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తంబళ్ల రవికి శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తంబళ్ల రవి గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. పేదల సేవలో ముందుండే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన 20 మంది అనుచరులు కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 80








