కారేపల్లి, మహా :సింగరేణి మండలం మేకల తండా బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులు అహర్నిశలు పాటుపడుతున్నారని తెలిపారు. బాలికలు తమ భవిష్యత్తును నిర్ధారించే క్రమంలో పదవ తరగతి విద్య చాలా కీలకమైంది అన్నారు. ఉన్నత చదువులు చదివేందుకు సమాజంలో స్థానం పొందేందుకు ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా కష్టపడతారు వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్న క్రమంలో పోటీ తత్వం అలవర్చుకొని ముందుకు సాగాలన్నారు.. విద్యార్థులు ప్రధానంగా పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూనే తమ విద్యను కొనసాగించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం బాలికలు తమ చదువు కొనసాగించేలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. విద్యతోపాటు క్రీడల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. బాలికలు ప్రధానంగా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాల అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు డిప్యూటీ వార్డెన్ బి కనకదుర్గ, సూర్య, భాస్కరరావు,హచ్యా ,బాదావత్ వీరన్న ,ప్రమీల,బాలు ,శ్రీరామ్,బి మోహన్,ఎల్ మోహన్,సక్రం ,భవాని,మానస, నీరజ,గ్రామస్తులు రవి, కుమార్,తదితరులు పాల్గొన్నారు.








