Mahaa Daily Exclusive

  నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి….. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి..!

Share

ఖమ్మం,మహా.
పాలేరు రిజర్వాయర్ లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.

అదనపు కలెక్టర్ పాలేరు రిజర్వాయర్ ను శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాలేరు రిజర్వాయర్ లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, వంటి వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.

ప్రాజెక్టులో నీటి నిల్వ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా ఎప్పటికప్పుడు దిగువకు నీరు విడుదల చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ , పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్.ఈ. ఎం. వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.