Mahaa Daily Exclusive

  కేంద్ర ప్రభుత్వ పధకాల పై విస్త్రుత ప్రచారం చేయాలి. బీజెపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ..!

Share

నేలకొండపల్లి, ఆగస్టు 15 మహా:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల పై క్షేత్ర స్థాయిలో విస్త్రుతంగా ప్రచారం చేయాలని బీజెపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలం కొత్తకొత్తూరు గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు, కూలీలతో ప్రత్యేక సమావేశం ను నిర్వహించారు. వారికి అందుతున్న పధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ద్వారా రైతులకు, కూలీలకు అందుతున్న పధకాల గురించి వివరించారు. అనంతరం కూలీలను, రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…. కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా పధకాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పదోవ పట్టిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పై ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, సంతోష్రెడ్డి, మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, అనంతు ఉపేందర్, మన్నె కృష్ణారావు, మల్లేబోయిన గోవిందరావు, సూరేపల్లి జ్ఞానరత్నం, రామకృష్ణ, తంగిళ్ల సతీష్, దివాకర్, నాగసాయి, వెంకటేశ్వర్లు, కంటు లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.