Mahaa Daily Exclusive

  గడ్డెన్న వాగు ప్రాజెక్టు 2 గేట్ల ఎత్తివేత నీటిని విడుద‌ల చేసిన‌ ఎమ్మెల్యే..!

Share

భైంసా మ‌హా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సంద‌ర్శించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రొజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్న‌ సందర్బంగా స్విచ్ నొక్కి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 15 వేల క్యూసెక్కుల నీరు రాగా, 5 వేల క్యూసెక్కుల నీటిని రెండు గేట్ల ద్వారా సుద్ద వాగులోకి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ ప్రొజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గేట్లను ఎత్తి నీటిని వదలడం జరుగుతుందని కావున వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. చేపల వేటకు వెళ్లే వారు, పశువుల కాపరులు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అన్నారు. కాగా ఈ వర్షాకాలంలో ప్రాజెక్టు గేట్లను ఎత్తడం ఇదే మొదటిసార‌ని తెలిపారు.