సిర్పూర్ మహా : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని, ప్రతి ఒక్కరూ ప్రాణాదాతలుగా నిలవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రెవాల్ పిలుపునిచ్చారు.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో డీఎఫ్ఓ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో అటవీ సిబ్బంది, పట్టణానికి చెందిన యువత, మహిళలు సహా 60 మంది రక్తదానం చేశారు.డీఎఫ్ఓ మాట్లాడుతూ, దేశంలో ప్రతి ఏడాది జరిగే రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో సకాలంలో రక్తం అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రక్తదానం విషయంలో ఉన్న అపోహలను త్రోసిపుచ్చి, ప్రతి యువతి-యువకుడు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని, క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని సూచించారు.
Post Views: 55








