Mahaa Daily Exclusive

  ఆసిఫాబాద్ లో ఘనంగా 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు..!

Share

సిర్పూర్ మ‌హా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఈ రోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో జరిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాష్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని, దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు.వివిధ శాఖల్లో విశిష్ట సేవలందించిన ఉద్యోగులను ప్రశంసాపత్రాలు అందజేస్తూ సత్కరించారు. విద్యార్థులు, సాంస్కృతిక బృందాలు అందించిన పాటలు, నృత్యాలు దేశభక్తి జ్ఞాపకాలను మలిపాయి.కార్యక్రమంలో సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎఫ్డీఓ శుశాంత్ బోబ్డేతో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.