Mahaa Daily Exclusive

  ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఉపాధ్యాయులను వేధిస్తున్నారు విద్యాశాఖ అధికారులు సంబంధిత విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి…!

Share

మంచిర్యాల, మహా : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు కళాశాలలకు విద్యాశాఖ ఈనెల 21 నుండి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం ఉపాధ్యాయులను బెదిరిస్తూ యధావిధిగా పనులు బోధన చేపించుకుంటున్నారని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టీవీయువి) రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ ఆరోపించారు.
మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని అన్నారు. ఒకవైపు దసరా సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు ఈనెల 21 నుండి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సెలవులు ప్రకటించిన విషయం విధితమే. ఇక్కడి కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులతో యధావిధిగా విధులకు హాజరుకావాలని హుకుం జారీ చేస్తున్నారని అన్నారు. విధులకు హాజరు కానిపక్షంలో నెలవారి జీతభత్యాలు ఇవ్వబోమని ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తూ పనులు బలవంతంగా చేపించుకుంటున్నారని ఆయన ఆవేద వ్యక్తం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకొని ఆయా విద్యా సంస్థలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సెలవులు ఇప్పించేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు బాలాజీ, విష్ణు, రమేష్, సాయి చరణ్ లో పాల్గొన్నారు.