Mahaa Daily Exclusive

  కాల‌నీ వాసుల శ్ర‌మ‌దానం..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు శ్ర‌మ‌దానం చేసారు. వర్షాకాలం కావ‌డంతో కాల‌నీలోని ఖాళీ ప్ర‌దేశాల‌లో పెరిగిన పిచ్చిమొక్క‌ల‌తో పాటు ప్రభుత్వ స్థలంలోని మున్సిప‌ల్ పార్క్ లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్క‌ల‌ను తొల‌గించారు. అలాగే కాల‌నీలోని దక్షిణముఖ ఆంజ‌నేయ స్వామి ఆల‌య పరిసర ప్రాంతంలో కూడా పిచ్చి మొక్క‌లు తొల‌గించి శుభ్ర‌ప‌రిచారు. కాల‌నీ వాసులను ప‌లువురు అభినందించారు.