Mahaa Daily Exclusive

  ఘ‌నంగా బ‌తుక‌మ్మ సంబ‌రాలు..!

Share

ఆదిలాబాద్ మ‌హా : బ‌తుక‌మ్మ సంబ‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకోవాల‌ని ఆదిలాబాద్ జిల్లా కలెక్ట‌ర్ రాజ‌ర్షి అన్నారు. మంగ‌ళ‌వారం జిల్లా ఎస్టీ ఎస్సీ, బీసీ, మైనారిటీ శాఖల ఆధ్వ‌ర్యంలో స్థానిక సంక్షేమ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన వేడుక‌లుకు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ఈ తొమ్మిది రోజులు జిల్లా మండ‌లాల‌లో అన్ని శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. త‌క్కువ స‌మ‌యంలో ఎంతో గొప్ప‌గా తొలిరోజు వేడుకుల‌ను నిర్వ‌హించిన అధికారులు సిబ్బందిని అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్స్ శ్యామ‌లాదేవి , రాజేశ్వ‌ర్, ఆర్డీవో స్ర‌వంతి, వివిధ సంక్షేమ శాఖ‌ల అధికారులు ప‌ట్ట‌ణానికి చెందిన మ‌హిళ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.