Mahaa Daily Exclusive

  మెప్మా భవనాన్ని ప్రారంభించిన మంత్రి ..!

Share

మందమర్రి, మహా : మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మునిసిపాలిటీలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మెప్మా భవనాన్ని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేకానంద, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళ శక్తి సంఘాలకు 21వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందజేసినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని వెల్లడించారు.
మొదటగా రాష్ట్రంలో 2004 సంవత్సరంలో మహిళల సంఘాలకు పావల వడ్డీ రుణాలను దివంగత నేత వైస్. రాజ శేఖర్ రెడ్డి అందించారని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మహిళల ఫ్రీ బస్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాలలో భారత రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రభుత్వం పేదలకు రెండు పడకల గృహాలను మంజూరు చేస్తామని మోసం చేసిందని ఆరోపించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదలకు భరోసా ప్రభుత్వం అని ప్రజలు కొనియాడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి తాసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కల పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.