Mahaa Daily Exclusive

  రోగులకు నాణ్య‌మైన‌ వైద్య సేవలు అందించాలి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఆదిలాబాద్ రూర‌ల్ మండ‌లంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిపరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న అన్ని గదులను పరిశీలించారు. ఏ గదిలో ఏ విభాగం కొరకు వినియోగిస్తున్నారని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు. రోజుకు ఎంతమందికి రక్త పరీక్షలు చేస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసి కి సంబంధించిన ఎన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. రోగులకు అన్ని రకాల మందులు సరిపోతున్నాయా లేదా ఇంకేం మందులు ఇస్తున్నార‌ని ఫార్మసిస్టుని అడిగి తెలుసుకున్నారు…స్టాఫ్ నర్స్, హెల్త్ సూపర్వైజర్ల వైద్య సేవలపై ఆరా తీసారు.అనంత‌రం జిల్లా కేంద్రంలోని వైద్యాధికారి కార్యాల‌యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలులో ఉన్న అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించి, కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.. స్వస్థ నారి స్వసక్త పరివార అభియాన్, ఇతర ఆరోగ్య కార్యక్రమాల సక్రమ అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. క్యాంప్‌కు హాజరైన అభివృద్ధి లో ఉన్న బాలికలు రోగులకు రోగులకు ఉన్న అనారోగ్య సమస్యలను చెప్పే సమయంలో పూర్తిస్థాయిలో వైద్యులు విన్న తర్వాత వారికి ఎలాంటి జబ్బు ఉందో నిర్ధారించి వైద్య పరీక్షలు చేయాలన్నారు. వారు చెప్పిన లక్షణాలను మనం చిరునవ్వుతో వింటే రోగికి 50% వరకు ఉప‌శ‌మ‌నం కలుగుతుందని చెప్పారు. వారు చెప్పిన లక్షణాలను బట్టి మన వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలు గురించి ఆరా తీశారు .ఎంతమంది అడ్మిట్ ఉంటున్నారో అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో మెడికల్ పారామెడికల్ సిబ్బంది వైద్యులు ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సాధన, జిల్లా మలేరియా నివారణ అధికారి ఎన్సిడి అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్, అంకోలి ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , పారామెడికల్ సిబ్బంది త‌దితరులు పాల్గొన్నారు.