మంచిర్యాల, మహా : సింగరేణి కాలరీస్ కంపెనీలో సంవత్సరానికి 5 కొత్త గనులు ప్రారంభించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాక్యానించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా ఆర్కే- 5 కాలనీలో సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి నివాసంలో బతుకమ్మ పేర్చే కార్యక్రమానికి ఆమెతో పాటు ఆ యూనియన్ జేబీసీసీఐ కమిటీ సభ్యులు రియాజ్ అహ్మద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ వ్యయంలో సింగరేణి కంపెనీకి వచ్చిన వార్షిక లాభాల నుండి ప్రతి సంవత్సరం ఐదు కొత్త గనులను ప్రారంభించాలని ప్రతిపాదనలు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆ ప్రతిపాదలను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడ బొగ్గు గనులు ప్రారంభమైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు. ఆనాడు ఆంధ్ర వలస పాలనలో ఉద్యోగాలు ఎక్కడ దొరికేటివి కావని అన్నారు. కేవలం సింగరేణి కంపెనీలో మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉండేటివని చెప్పారు. తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని తెలంగాణ స్వరాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నామని గత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చారు. సింగరేణికి వచ్చిన లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి చెప్పకుండా అభివృద్ధి పేరిట వందల కోట్లా రూపాయలు తీసుకుంటుందని ఆరోపించారు. ఇవే కాకుండా సింగరేణికి రావలసిన విద్యుత్ బకాయిలు 42 వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా నాన్సుడు ధోరణి అవలంబిస్తుందని వివరించారు. ఈ డబ్బులే చాలదన్నట్లు ఎల్ఐసి సంస్థ దగ్గర అప్పులు తీసుకొని కర్ణాటక ఇతర రాష్ట్రాలలో సింగరేణి సంస్థ విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉవ్విల్లు ఊగుతుందని పేర్కొన్నారు.
పెద్దపల్లి నుండి మంచిర్యాల వరకు కాంగ్రెస్ గుండాయిజం ఎక్కువైంది
పెద్దపల్లి నుండి మంచిర్యాల వరకు కాంగ్రెస్ నాయకులే గెలిచారన్నారు. ఇక్కడ గెలిచిన నాయకులు, వారి అనుచరుల గుండాయిజం, రౌడీ యిజాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఇవి కొద్ది రోజులు మాత్రమే నడుస్తాయని అన్నారు. ఈ చర్యలను మార్చుకోకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిందని ఘాటుగా ఆరోపించారు. అవినీతికి స్వస్తి పలికితే కొత్త గనులతో పాటు వేల కొరది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సింగరేణి గని కార్మికులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్ళు, హెచ్ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రగతి స్టేడియం లో మహిళలతో బతుకమ్మ ఆటపాట కార్యక్రమాలలో పాల్గొంటారు.








