Mahaa Daily Exclusive

  ఫలించిన బుజ్జగింపులు..! మీనాక్షి నటరాజన్‌, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ భేటీ.. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ..

Share

  • ఫలించిన బుజ్జగింపులు..
  • అలక పాన్పు దిగిన అంజన్ కుమార్
  • మీనాక్షి నటరాజన్‌, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ భేటీ.. సముచిత స్థానం కల్పిస్తామని హామీ
  • రాహుల్‌గాంధీ ప్రధాని కావడమే నా ముఖ్య ఉద్దేశమన్న అంజన్ కుమార్ యాదవ్

 

హైదరాబాద్, మహా: పార్టీ చర్యలతో మనస్తాపానికి గురైనట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న తనను ఇప్పుడు పక్కనపెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పార్టీలో నేను చాలా సీనియర్‌. నేనెప్పుడూ ఓడిపోలేదు.. అందరూ కలిసి ఓడగొట్టారు. నాకు టికెట్‌ ఇస్తే గెలిచేవాడిని. కరోనాతో వెంటిలేటర్‌పై వైద్యం చేయించుకున్నా. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాను. కాంగ్రెస్‌ పార్టీలో అనేక పదవులు చేపట్టాను. రెండు సార్లు హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. రాహుల్‌గాంధీ ప్రధాని కావడమే నా ముఖ్య ఉద్దేశం’’ అని అంజన్‌కుమార్‌ అన్నారు.

 

జూబ్లీహిల్స్ ఎన్నిక అంజన్ కుమార్ సారధ్యంలో..

కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి ఎన్నికల్లో అందరినీ సంప్రదించిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని..అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో కినుక వహించిన అంజన్ కుమార్ ఇంటికి ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, వివేక్, నేను వచ్చాం అని, వారి భవిష్యత్ పై మాట్లాడం అని తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అని..రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారని గుర్తు చేశారు. కరోనా సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ఆయన కూడా కరోనా బారిన పడ్డారన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.. వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందుకు పోతున్నాం అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుందని.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక అంజన్ కుమార్ సారధ్యంలో జరుగుతుంది.. ఆయన నేతృత్వంలో ముందుకు పోతున్నాం అన్నారు. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్ తో మాట్లాడారని తెలిపారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారు అని..అదే రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నీ గెలిపిస్తారని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. అంజన్ కుమార్ యాదవ్ ముందుండి ఉప ఎన్నికల్లో ప్రచార కార్కక్రమాలు తీసుకుంటారన్నారు. మా పార్టీ నియంతృత్వం పార్టీ కాదు.. బయటికి స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు. అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు అన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయడమే మా అందరి లక్ష్యం.. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరం కలిసి పని చేస్తాం అని పొన్నం స్పష్టం చేశారు.

Latest