వేదిక బ్యూరో ,హైదరాబాద్ :
నటుడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్దీ మంది సన్నిహితుల మధ్య వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. వీరినిశ్చితార్థంపై నిజమేనా..? అంటూ నెట్టింటా జోరుగా ప్రచారం జరిగింది. నాగార్జున ఫొటోలు షేర్ చేయడంతో వార్త నిజమేనని అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
చైతూ–శోభిత జోడీ
2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అప్పటినుంచే చైతూ–శోభిత జంటపై రూమర్స్ వచ్చాయ్. ఇద్దరు లవ్‌లో పడ్డారని, డేటింగ్ చేస్తున్నట్టు కూడా చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Post Views: 15








