Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ లో చేరిక‌ల పరంపర..ఆదిలాబాద్ లో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్..

Share

  • కాంగ్రెస్ లో చేరిక‌ల పరంపర
  • ఆదిలాబాద్ లో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
  • కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో పెద్ద ఎత్తున చేరిక‌లు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌ల పరంపర కొన సాగుతోంది. నియోజ‌క వ‌ర్గం నుండి ప్ర‌తీ రోజు వ‌ర‌ద‌లా చేరిక‌లు జ‌రుగుతున్నాయి . ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జా సేవాభ‌వ‌న్ సంద‌డిగా మారుతోంది. మ‌రి కొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నున్నస్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంలో జ‌రుగుతున్న చేరిక‌ల‌తో కాంగ్రెస్ పార్టీలో జోష్ క‌నిపిస్తోంది. ఇవాళ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,బొమ్మకంటి రమేష్,

బూర్ల శంకరయ్య,జహీర్ రంజాని ఆధ్వ‌ర్యంలో

కేఆర్కే కాలనీ బీఆర్ఎస్ అధ్యక్షులు,కాలనీ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దాసరి ఆశన్న,ఉపాధ్యక్షులు కట్కం శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో కాల‌నీ వాసులు కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేరారు.అందరికి కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారుకంది శ్రీనివాస రెడ్డి.యువ‌తకు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఇలా పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి పార్టీని బ‌లోపేతం చేయ‌డం శుభ ప‌రిణామ‌మ‌న్నారు. ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌లేవైనా కాంగ్రెస్ పార్టీ ని గెలిపించేలా కృషి చేయాల‌న్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేద‌ల పార్టీ అని అందుకే గ‌రీబోళ్ల కోసం ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చింద‌న్నారు. ఎన్నిక‌లు ఏవొచ్చినా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయించేలా ప్ర‌తీ నాయ‌కుడు కార్యక‌ర్త అంకితభావంతో ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,మున్సిపల్ ,కౌన్సిలర్లు యెల్మెల్వార్ అర్చన – రామ్ కుమార్,దర్శనాల లక్ష్మణ్,జాఫర్ అహ్మద్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల సుకేందర్,ఆదిలాబాద్ రూరల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చేట్టి నాగన్న,నాయకులు ఎం.ఏ షకీల్,దుర్గం శేఖర్,పత్తి ముజ్జు,మోర ఆశన్న,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.