Mahaa Daily Exclusive

  పోరాట యోధుడిగా ప్రభాస్.. ప్రభాస్ హాను మూవీ లాంఛ్..

Share

రెబల్ స్టార్ ప్రభాస్, ‘సీతారామం’ ఫేమ్ ద‌ర్శ‌కుడు హను రాఘవపూడి కాంబోలో తెర‌కెక్క‌నున్న కొత్త మూవీ శ‌నివారం పూజా కార్య‌క్ర‌మం జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో డార్లింగ్ ప్ర‌భాస్‌తో పాటు డైరెక్ట‌ర్ హ‌నూ, మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్, ఇత‌ర సినీ ప్ర‌ముఖులు సందడి చేశారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో ప్రభాస్ న్యూ లుక్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమా ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల‌ టాక్.

 

ఇక ప్ర‌భాస్ చిత్రాల విష‌యానికి వ‌స్తే.. ఈ ఏడాది స‌లార్ పార్ట్‌-1, క‌ల్కి 2898 ఏడీ ల‌తో అభిమానుల‌ను అల‌రించాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో మారుతి సినిమా రాజాసాబ్‌, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌, స‌లార్: శౌర్యంగ ప‌ర్వం, క‌ల్కి పార్ట్‌-2 ఉన్నాయి. ఇప్పుడు ఫౌజీని కూడా లైన్‌లో పెట్టాడు. రాజాసాబ్‌తో పాటు ఫౌజీ కూడా త్వ‌ర‌లోనే సెట్‌పైకి వెళ్ల‌నుంది. వీటిలో రాజాసాబ్ 2025 ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది.