ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ ఢిల్లీ పర్యటన పైన స్పందించారు. హైకమాండ్ ఆశీస్సుల కసం ప్రతీ క్షణం పాకులాడితే తెలంగాణ సమాజం కుర్చీ లాగేనటం తథ్యమని పేర్కొన్నారు. రేవంత్ కు దమ్ముంటే ఛలో పల్లెకు రావాలని సవా్ చేసారు. సీఎం, మంత్రులు ఉండాల్సిది ఢిల్లీలో కాదన్నారు. ఢిల్లీ యాత్రలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటని కేటీఆర్ నిలదీసారు.
ఢిల్లీ టూర్ పై
సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. రుణమాఫీ అవ్వక రైతులు అల్లాడుతుంటూ ఢిల్లీ యాత్రలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదని.. తెలంగాణ గల్లిలో అంటూ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికపై కేటీఆర్ చేసిన ట్వీట్ లో..”సీఎం రేవంత్ కు దమ్ముంటే… చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..?? ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో.. ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..?? రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..?? ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారని విమర్శించారు.
ఏంటి ప్రయోజనం
దీనికి కొనసాగింపుగా..గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు.. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..?? అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..?? అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప.. అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..?? రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. ”గుండుసున్నా” అంటూ ఎద్దేవా చేసారు.
కుర్చీ లాగుతారు
ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం.. జై కిసాన్ జై తెలంగాణ” అంటూ కేటీఆర్ ట్వీట్లో టార్గెట్ చేసారు.








