Mahaa Daily Exclusive

  పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేపట్టాల….ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్..

Share

మహా వరంగల్ బ్యూరో;

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతులు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ ధాన్యాన్ని తీసుకురావాలని, కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.