Mahaa Daily Exclusive

  జిల్లాలో ఘనంగా సంక్షేమ వారోత్సవాలు.

Share

*జిల్లాలో ఘనంగా సంక్షేమ వారోత్సవాలు*

*సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను, కేజీబీవీని సందర్శించిన కలెక్టర్*

*విద్యతో పాటు మెరుగైన వసతి, పోషకాహారం అందించాలి*

*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

మహా వరంగల్ బ్యూరో;

సంక్షేమ వారోత్సవాలు వరంగల్ జిల్లా లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రతిభ ఉత్సవాలు, వ్యాసరచన పోటీలు, వీధి నాటకాలు వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా రాయపర్తి మండలంలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను , పర్వతగిరి కేజీబీవీని
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలను, అందిస్తున్న విద్యా, వసతులు, ఆహార నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు.

విద్యార్థులతో ముచ్చటించి వారి అభ్యాస స్థాయి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పోషకాహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే గురుకులాల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడల తో పాటు ఇతర సహ పాఠ్య కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిబిసిడిఓ పుష్పలత, సంబంధిత హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని, విద్యార్థుల్లో చదువు, క్రీడలు, పాటలు, వివిధ కార్యకలాపాల పై అవగాహన కల్పించారు.