* విశాఖ-
* *గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన ఐటీ మంత్రి నారా లోకేష్*
* గూగుల్ తో భారత్ లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చింది.
* ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కనెక్స్ , ఎయిర్ టెల్ నెక్స్ ట్రా సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు
* ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు, యువతకు ప్రత్యేకంగా నమస్కారం
* 2026 ఏప్రిల్ 28 నుంచి విశాఖ లో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తోంది
* ఉక్కు నగరంగా పేరు పొందిన విశాఖ ఇక డేటా సిటీ అవుతుంది.
* ఏఐ డేటా సెంటర్ తో గ్లోబల్ ఐటీ మ్యాప్ లోకి విశాఖ గూగుల్ వచ్చి చేరింది
* 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. దానిని పునరుద్ధరిస్తూ ప్రజలు కూటమికి ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు
* సైబరాబాద్ ను హైటెక్ సిటిగా మార్చిన ట్రాక్ రికార్డు ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఉంది
* ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ లాంటి ప్రాజెక్టులు వేగంగా పెట్టుబడులు వస్తున్నాయనటానికి ప్రత్యక్ష ఉదాహరణ
* దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్, ఏపీలో డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్లతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాకారం అవుతోంది
* ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనే 25 శాతం మేర పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి
* ప్రపంచం గతంలో చూడని నవ భారతం ఈ టెక్ ప్రాజెక్టుతో సాకారం అవుతోంది.
* సైబరాబాద్ నిర్మాణం అంతా చూశాం. ఇప్పుడు విశాఖలోని ఏఐ డేటా సెంటర్ తో కొత్త ట్రాజెక్టరీ ఆవిష్కృతం అయ్యింది
* రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి
* సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెకానికల్ సహా వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి
* ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని విధానం ప్రజాప్రభుత్వానిది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా నినాదం
* క్లస్టర్ బేస్డ్ అభివృద్ధితో రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి
* 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది
* ప్రజా ప్రభుత్వానిది గూగుల్ అయితే ఆ పార్టీది గొడ్డలి. కొందరు కేసులు వేసి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు
* గూగుల్ క్రెడిట్ కూడా తీసుకునేందుకు సీసీడీ రోగి ప్రయత్నిస్తారు.
* ఆంధ్రప్రదేశ్ పై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టినందుకు గూగుల్ కు ధన్యవాదాలు, అదానీ, ఎయిర్ టెల్ సంస్థలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం
* మొదటి ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్ గా విశాఖ ప్రాంతాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది
* నారా లోకేష్,
* ఐటీ శాఖ మంత్రి








