Mahaa Daily Exclusive

  అదిరిపోయిన ప్ర‌భాస్ ‘రాజా సాబ్’ కొత్త పోస్ట‌ర్..

Share

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రాల‌లో ఒక‌టి రాజా సాబ్ (Raaja Saab). భలే భ‌లే మొగాడివోయ్ ఫేమ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌స్తుండ‌గా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

 

అక్టోబ‌ర్ 23న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ప్ర‌భాస్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ గళ్ళ కోటు, నల్ల ప్యాంటు.. లోప‌ల‌ టీ షర్ట్‌తో అదిరిపోయాడు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైర‌ల్‌గా మారింది.

 

ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest