- కాసోజు వైష్ణవిని అభినందించిన ఎమ్మెల్యే రంగారెడ్డి
- ప్రభుత్వ పాఠశాలలో చదివి 567 మార్కులు సాధించడం అభినందనీయం..
- ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాలలో చదివి 567 మార్కులు సాధించిన కాసోజు వైష్ణవిని ఎమ్మెల్యే రంగారెడ్డి అభినందించారు. సోమవారం ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ లో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలవడంతో విద్యార్థినిని కాసోజ్ వైష్ణవిని అభినందించి శాలువాతో సత్కరించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన వైష్ణవి 567 మార్కులు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో మంచి విద్యనభ్యసించి ఉన్నతమైన విజయాలు అందుకోవాలని విద్యార్థినికి, ఎమ్మెల్యే రంగారెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఉజ్వల భవిష్యత్తు బాటలు వేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి శ్రీనివాస్ చారి ఉన్నారు.
Post Views: 175







