- కోత్వాల్ గూడ క్వారీపై హైడ్రాధికారుల ఉక్కుపాదం.!
- రాష్ట్ర మంత్రిపై ఆరోపణలకు తెర.?
- అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు హైడ్రాధికారులు…
రాజేంద్రనగర్ మహా:
కోత్వాల్ గూడ ప్రభుత్వ భూములలో వెలిసిన అక్రమ మైనింగ్ స్టోన్ క్రషర్ క్వారీపై హైడ్రాధికారులు ఉక్కుపాదం మోపారు.. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ సర్కిల్ పరిధి కొత్వాల్ గూడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమ స్టోన్ క్రషర్ మిషన్లప్తె హైడ్రాధికారులు కోరడా జులిపించారు.
కొంతకాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ భూములలో స్టోన్ క్రషర్ మిషన్లు ఏర్పాటుచేసి ప్రకృతి సహజ సిద్ధమైన గుట్టలను పిండి చేసి దండుకుంటున్నారని బిఆర్ఎస్ నేతల ఆరోపణల నేపద్యంలో, భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్ క్వారీప్తె మైనింగ్ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
మైనింగ్ అధికారుల నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో మంగళవారం హైడ్రాధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జెసిబిల సహాయంతో అక్రమం మైనింగ్ క్వారీని కూల్చివేశారు. దీంతో మంత్రిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమేనా.? ఆరోపణలకు తెరపడినట్లేనా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







