Mahaa Daily Exclusive

  పని హక్కును హరిస్తున్న మోడీ ప్రభుత్వం…

Share

  • పని హక్కును హరిస్తున్న మోడీ ప్రభుత్వం
  • కొత్త నిబంధనలాతో ఉపాధి దూరం
  • 15 తేదీన పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నా జయప్రదం చేయండి

కారేపల్లి, మహా : కేంద్రంలోని మోడి ప్రభుత్వం రాజ్యాంగ బద్ద పని హక్కును హరిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కేసగాని ఉపేందర్ అన్నారు. బుధవారం కారేపల్లి మండలం గాంధీనగర్ లో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని వ్యకాస బృందం సందర్శించింది. కూలీలలో వ్యకాస నేతలు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెండు సార్లు ఫోటో విధానంతో ఇబ్బందులు పడుతున్నట్లు కూలీలు తెలిపారు. కూలీలకు సమస్యలు, డిమాంఢ్ల పరిష్కారానికి ఈ నెల 15 న పంచాయతీ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఉపాధి కూలీలు అందరు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని కోరారు ఈసందర్బంగా వ్యకాస నేత కేసగాని ఉపేందర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ను వీబీజీరాంజీ గా పేరు మార్చటంతో పాటు నిధులలో కోత విధించిందన్నారు. ఉపాధి నిధులలో కేంద్రం 60 శాతం ఇస్తామని మిగతాది 40 శాతం ఇవ్వాలని షరతులతో లక్ష్యం నీరుగారే పరిస్ధితి వచ్చిందన్నారు. రోజు వారి కూలీ రూ.307 ఇవాల్సి ఉండగా ప్రస్తుతం రూ.150 కూడా పడటం లేదన్నారు. పని ప్రదేశాలలో టెంట్, నీరు, మెడికల్ కిట్స్ కల్పించటం లేదన్నారు. కూలీలకు ప్రమాధ భీమా కేంద్రం ప్రభుత్వం అమలు చేయాలని ప్రమాదానికి గురైతే రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఉపాధి పనులను 200 రోజులకు పెంచి రూ.600 వేతనం, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలందరికి ఇస్తానన్నా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూ.12వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పధకం సమస్యలపై ఈనెల 15 న జిపి కార్యాలయాల ముందు 20 తేదీ న ఖమ్మం కలెక్టర్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు సంబంధిత కరపత్రాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మౌనిక, నాగమణి బాయమ్మ, సూరమ్మ,దశరథ, కోటయ్య, వెంకన్న, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు..