కారేపల్లి, మహా:కారేపల్లి మండల ఇన్చార్జి ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన మల్లెల రవీంద్ర ప్రసాద్ ను బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్పంచులు ఘనంగా సన్మానించారు. పలువురు సర్పంచు లు ఇన్చార్జి ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ ని శాలువాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధిలో మాకు సహకరించి అన్ని విధాలుగా అభివృద్ధి జరిగేలా కృషి చేయాలని సర్పంచులు ఇన్చార్జి ఎంపీడీవోను కోరారు. అన్ని పంచాయతీలకు సమన్యాయం జరిగేలా చూస్తానని ఇన్చార్జి ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Post Views: 63








