ప్రత్యేక ప్రతినిధి మహా :
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం మాసాయిపేట గ్రామ సరిహద్దుల్లో స్పెక్ట్రా, మహాసిటీ, గేలాక్సీ పేర్లతో రియల్ మాఫీయా మోసాలకు పాల్పడుతోంది. సర్వే నెంబర్లు 726,776లలో 82ఎకరాల్లో లే అవుట్ నిర్మాణం చేయటానికి డిటిసిపీ అనుమతుల కోసం ఇరిగేషన్ అధికారుల సంతకాలను పోర్జరీ చేసి అడ్డదారిలో అనుమతులు పొందినట్లు బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దాంతో కళ్లు తెరిచినా ఇరిగేషన్ అధికారులు ఆఘ మేఘాలమీద పోర్జిరీలకు పాల్పడిన సుంకోజు మదన్ మోహన్, సుంకోజు కృష్ణ సాయి, సుంకోజు సృజన్, సుంకోజు సురేష్ జంగం అను వ్యక్తలపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయించారు.. అంతవరకూ బాగానే ఉంది.సర్వే నెంబర్లు 726,776లోగ 82ఎకరాల విస్తీర్ణలో లే అవుట్ నిర్మాణం సాగుతున్నప్పటికి… లే అవుట్ కు ఎటువంటి పేరుపెట్టకుండా గాలిలో విక్రయాలు జరుపుతోంది.అలాగే నకిలీ ఎనోసి లు సృష్టించి డిటిసిపీ అనుమతులు పొందింది కాబట్టి స్పెక్ట్రా యాజమాన్యానికి జారీ చేసిన డిటిసిపీ అనుమతులు రద్దు చేయాలని ఇరిగేషన్ అధికారులు లెటర్లు రాయాల్సి ఉంటుంది .. కాని రియల్ మాఫీయా నోట్ల కట్టలతో నోళ్లు మూయించటంతో అధికారులు చర్యలు తీసుకోలేదని ఇదే అదునుగా భావించిన రియల్ మాఫీయా రెచ్చిపోయి అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకొంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.








