పలుగోని చెరువు మాయం :
మసాయి పేట గ్రామ సమీపంలోగల పలుగోని చెరువు రియల్ మాఫీయా కబంధహస్తాల్లో చిక్కి అన్యాక్రాంతమైంది. కొండలు, గుట్టలు మీద పడిన ప్రవాహం సెల ఏళ్ళులా ప్రవహించి పలుగోని చెరువు లోకి చేరి నిత్యం నిండుకుండాల కనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. సర్వే నెంబర్ 776 లో చెరువు ఉన్నట్లు ఇరిగేషన్ రికార్డుల బట్టి తెలుస్తోంది. కాని రియల్టర్లతో కుమ్మకై ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సర్వే నెంబర్ 776 కు బదులు 727వేసి కేసు నమోదు చేయటం, చెరువును మాయం చేసిన రియల్ మాఫీయను కాపాడేందుకే అధికారులంతా రింగయ్యారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. చెరువుతోపాటు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లను మట్టితో పూడ్చి ప్లాటు వేసి అమ్మకాలు జరిపి రియల్ మాఫీయా సొమ్ము చేసుకుందని స్థానికులు బలంగా వాదన వినిపిస్తున్నారు.. స్పెక్ట్రా పేరులో నడిపిస్తున్న వెంచర్ కు ఊరు పేరు లేకుండా 82ఎకరాల్లో ప్లాట్లను గాల్లో విక్రయించి రియల్టర్లు వందలకోట్లు కొల్లగొట్టారని ఏ ముగ్గురు కలిసిన ఇదే ప్రధాన చర్చగా జరుగుతుంది. స్పెక్ట్రా యజమాని ఎక్కడా స్క్రీన్ మీద కనిపించడు బ్రోకర్ వ్యవస్థ ఇక్కడ కీలకంగా మారి ఆర్థిక లావా దేవీలు సాగించటం విశేషం.








