గ్రీన్ బెల్ట్ స్థలం ఎక్కడా..?
గ్రీన్ బెల్ట్ స్థలామంటే వేసే వెంచర్ లో 10శాతం గ్రీన్ బెల్ట్ స్థలానికి కేటాయించాల్సి ఉంటుంది. అంటే 82 ఎకరాల్లో 8ఎకరాల రెండు గుంటల భూమిని తీసి మౌళిక సదుపాయాలు అనగా రోడ్లకు, వాటర్ ట్యాంకులు, గుళ్ళు, లైబ్రరీ, వాకింగ్ ట్రాక్, పిల్లలు,పెద్దలు ఆడుకొనేందుకు పార్కులు, ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 10శాతం తోపాటు మరో 6శాతం గ్రామ పంచాయితీ అభివృద్ధికి గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరుమీద గిఫ్ట్ డీడ్ చేసి అప్పగించాల్సి ఉంటుంది. కాని ఒక్క గజం జాగాను కూడా వదలకుండా ప్లాట్లు చేసి విక్రయాలు జరుపుతుంటే గ్రామ పంచాయతీ అధికారులు ఎందుకు అడ్డుకోవటంలేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం రు 3 నుండి రు 4 కోట్ల మేరకు ధర పలుకుతోందని 8 ఎకరాల విలువ సుమారు రు 30 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. అధికార యంత్రంగం తోపాటు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్పెక్ట్రా సాగిస్తున్న అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు…








