Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ బృందం భేటీ.. కేంద్రం సహకరించకున్నా మొక్కజొన్నలు కొంటున్నామన్న సీఎం!

Share

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో సీపీఐ ప్రతినిధి బృందం సమావేశమైంది. సీపీఐ శాసనసభ్యుడు కూనమనేని సాంబశివ రావు గారి నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిశారు. కార్మికులకు కనీస వేతనాల పెంపు నిర్ణయంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.

❇️ ఈ సందర్భంగా రైతుల అంశంపై ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని అన్నారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులు ఇబ్బందులు పడొద్దని మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని అన్నారు.

❇️ ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం గారు, నాయకులు పశ్య పద్మ గారు, ఈ. నరసింహ గారు, చాడ వెంకట్ రెడ్డి గారు, బాగం హేమంతరావు గారు, శంకర్ గారు, బాల నరసింహ గారు, వీఎస్ బోసు గారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు.