Mahaa Daily Exclusive

  పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం..

Share

  • పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం
  • పీహెచ్‌సీ సమస్యలు పరిష్కరిస్తాం
  • పచ్చదనంతోనే జీవుల మనుగడ

కారేపల్లి, మహా : పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది విధుల గురించి వైద్యాధికారి డాక్టర్ బీ సురేష్ ను అడిగితెలుసుకున్నారు. పీ¾హెచ్‌సీ ఆప్‌గ్రేడ్, అందుబాటులో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విలేకరుల సూచనలపై స్పందించిన హెల్త్ డైరక్టర్ జిల్లా, రాష్ట్ర అధికారులతో చర్చించి కారేపల్లి పీహెచ్‌సీలో సేవలకు కల్పనకు కృషి చేస్తానన్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన అవేక మంది పడుతున్నారన్నారు. వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తప్పని పరిస్ధితిలో మాత్రమే ఎండ నుండి రక్షణగా ఉండే దుస్తులు ధరించి బయటకు రావాలని కోరారు. పచ్చదనం లోపించటంతో రానురాను ఉష్ణోగ్రతలు పెరుగుతూ జీవజాతుల మనగడ కష్టంగా మారిందన్నారు. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించటంతోనే మానవనుగడ సాధ్యమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో వ్యయం చేస్తుందనిలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో లేకపోతే ముందుగానే ఇండెంట్ పెట్టి లోటు లేకుండా చూచుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. హెల్త్ డైరక్టర్ వెంట డీఎంహెచ్‌వో రామారావు, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు నాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణు మాధవ్, కారేపలి మండల వైద్యాధికారి సురేష్, సూపర్‌వ్పుైర్ సూర్యం, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.