Mahaa Daily Exclusive

  కారేపల్లి లో ఘనంగా బక్రీద్….

Share

 

కారేపల్లి, మహా : కారేపల్లి జామే మజీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద గురువారం బక్రీద్ పండగ (ఈదుల్ అజ్హా) నమాజ్ ను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జామే మస్జిద్ అధ్యక్షులు షేక్ మునీరుద్దీన్ పటేల్ పండుగ ఉద్దేశం ప్రవక్త యొక్క త్యాగాలను వివరించి, అందరు ఆచరించాలని బోధించినారు. ఈద్గా వద్దకు సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోని) చేరుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేక్ షఫీ, షేక్ అబ్దుల్ మతీన్, షేక్ శంషుద్దీన్, మౌలానా అబ్దుల్ మజీద్, ఎండీ బాబు, హనీఫ్, షేక్ తాజుద్దీన్, మహమ్మద్ నసీర్, సర్దార్, మహమ్మద్ యాకుబ్ అలీ, నూరుల్ అతీక్, పారుఖ్, షేరు, ముజామిల్, మహమూద్ పాషా, ఖైరుద్దీన్, కబీర్, జావిద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.