Mahaa Daily Exclusive

  కారేపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి…….

Share

  • కారేపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
  • రోగులకు పండ్లు పంపిణి చేసిన టీడీపీ

 

కారేపల్లి, మహా : తెలుగుదేశం వ్యవస్ధాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమÖరి తారక రామారావు 103 జయంతిని గురువారం కారేపల్లిలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా నాయకులు మండెపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. బాణాసంచాకాల్చి, కేక్‌ను కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు. టీడీపీ జెండాను మండెపూడి శ్రీనివాసరావు అవిష్కరించారు. అనంతరం కారేపల్లి పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈసందర్బంగా మండెపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, ఔనత్యాన్ని చాటిచెప్పిన వారిలో ఎన్టీఆర్ ఒకరన్నారు. తెలుగుజాతిని ఐక్యం చేయటం ద్వారా అవినీతిపై పోరాడి అనతి కాలంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిఘనత సాధించారన్నారు. ఎన్టీఆర్ అందరికి మార్గదర్శకుడని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్టీఆర్ వీరాభిమాని బిక్కు దంపతులు, టీడీపీ నాయకులు గంగరబోయిన శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెద్దమ్మ భాగ్యలక్ష్మి, చిన్ని శ్రీనివాస్, దుద్దుకూరి వెంకన్న, ఎýగందుల మధు, హోటల్ రాము, కంచి సాయి, హున్య, సాయిన్ని సాయిదయ్య, నరసింహారావు, నూకల నగేష్, శేషయ్య, రామకఅష్ణ, నాగేశ్వరరావు, సూర్యం, మత్రు ,బిక్కు, రాజు,నేరెళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.