- పోలీసు శాఖలో కొలువుల జాతర
- 5 వేల ఖళీల భర్తీకి రంగం సిద్ధం
- ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ
- ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం వెయిట్
- సైబర్ క్రైం, ఈగల్ టీంలలో అధిక నియామకాలు
- ఐటీ నిపుణులకు అధిక అవకాశం
హైదరాబాద్, మహా : ఐటీ రంగంలో నిపుణత ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు పోలీసు శాఖ సన్నద్దమైంది. రాష్ట్ర పోలీసు శాఖలో గత కొన్నాళ్ళుగా ఖాళీలు భారీగా పెరుగుతున్నాయి. పోలీసు గణాంకాల ప్రకారం శాఖలో దాదాపు 15 వేల ఖాళీలున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. అయితే రోజు రోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా తదితరాలపై ఉక్కు పాదం మోపాలన్న కృత నిశ్చయంతో ఫ్రభుత్వం ఉన్నందున ఆ విభాఘాలను పటిష్టం చేయడంతో పాటు నిఫుణులను నియమించుకోవాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కంపన్సరీ రిక్రూట్ మెంట్ కోసం కనీసం అయిదు వేల పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ పోలీసు శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖను అభ్యర్థిస్తూ ఫైల్ పంపించింది. ఈ ఫైల్ ను పరిశీలించిన ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. నేడో రేపో ఫైల్ కు క్లియరెన్స్ రాగానే రిక్రూట్ మెంట్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో పోలీసు రేషియో లేదు. అయినప్పటికీ వీలైనంత మేర విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యమిస్తున్న ఉన్నతాధికారులు అన్నంతలో పౌరులకు సేవలను అందిస్తున్నారు. రిటైర్మెంట్లు, పోలీసు ఉద్యోగాలకు రాజీనామాలు చేయడం, అకాల మరణాలు తదితర కారణాలతో ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న సిబ్బందిపై పని వత్తిడి కూడా పెరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు ఉద్యోగ నియామకాలకు అనుమతి కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తూనే ఉన్నారు. ఉద్యోగ నియామకాలపై చిత్తశుద్ధితో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంపై ఖాళీల భర్తీకి సుముఖంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆర్థిక ఎప్పటికప్పుడు కొర్రీలు వేస్తుండటంతో ఉద్యోగ నియామక ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. మరో పక్క రాష్ట్ర పోలీసు శాఖకు ఆర్థిక నేరగాళ్ళు, డ్రగ్స్ మాఫియా ముఠాలు ఎప్పటికప్పుడు సవాళ్ళు విసురుతూ తమ పంథాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఈ నేరాలకు అడ్డకట్ట వేయాలంటే ఈగల్ టీంతో పాటు సైబర్ క్రైం వభాగాన్ని పటిష్టం చేయడంత పాటు నిఘాను పెంచాల్సిన అవసరం ఉందని, సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహనను మరింతగా పెంచేదుకు చేపట్టాల్సిన చర్యలు కూడా చాలా ఉన్నందున వీలైనంత మేర ఈగల్ టీం, సైబర్ క్రైం విభాగంతో మరికొన్ని కీలక విభాగాల్లో సిబ్బంది నియామకానికి అనుమతించాలని కోరూతా పోలీసు శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రతిపాదనలను సిద్దం చేసిన అధికారులు ఆర్థిక శాఖ క్లియరెన్స్ కు ఫైల్ పంపడం, ఆర్థిక శాఖ ఫైల్ క్లియరెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండ జరిగిపోయింది.
ఐటీ రంగంలో నిష్ణాతులైన వారిని ఈగల టీంలో, సైబర్ క్రైం విభాగాలలో భర్తీ చేయాల్సి ఉన్నందున త్వరలోనే ఆయా రంగాలలో అనుభవం, నిష్ణాతులైన వారిని ఎంపిక చేసేందుకు మార్గం సుబగమమైందని అధికారులు తెలిపారు. త్వరలోనే పోలీసు నియామక బోర్డు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేయనుందని, నియామక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఏడాదిలోగా పూర్తి చేసి సిబ్బంది సంఖ్యను పెంచనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.







