Mahaa Daily Exclusive

  నిరుద్యోగులకు ‘మెగాదగా’.. జూన్ 1న ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా: వైఎస్సార్సీపీ యువజన నేత గేదెల సూర్యప్రకాష్ పిలుపు..!

Share

ఏలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాష్ మండిపడ్డారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా జూన్ 1వ తేదీ (సోమవారం) ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, జక్కంపూడి రాజా ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సూర్యప్రకాష్ వెల్లడించారు. జిల్లా నేతలు దూలం నాగేశ్వరరావు, మామిళ్ళపల్లి జయప్రకాష్, కారుమూరి సునీల్ ల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుందని ఆయన పేర్కొన్నారు.
ధర్నా వివరాలు:
తేదీ & సమయం: జూన్ 1 (సోమవారం), ఉదయం 9.30 గంటలకు
స్థలం: జిల్లా కలెక్టరేట్ వద్ద, ఏలూరు.
తరలిరావాలని సూర్యప్రకాష్ విజ్ఞప్తి కూటమి ప్రభుత్వం చేసిన ఈ దగాపై పోరాడేందుకు నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు భారీగా తరలిరావాలని గేదెల సూర్యప్రకాష్ కోరారు. అలాగే వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.