Mahaa Daily Exclusive

  ప్ర‌జ‌ల భ‌ద్ర‌తే ల‌క్ష్యం-డీజీపీ సీవీ ఆనంద్..

Share

  • ప్ర‌జ‌ల భ‌ద్ర‌తే ల‌క్ష్యం-డీజీపీ సీవీ ఆనంద్
  • ఆదిలాబాద్ కమాండ్ కంట్రోల్ లో 300 సీసీ కెమెరాలు ప్రారంభం
  • సాంకేతిక ప‌రిజ్ఞానంతో మెరుగైన భ‌ద్ర‌తా సేవ‌లు

ఆదిలాబాద్ మ‌హా : జిల్లాలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణ , విచారణను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేసిన 300 నూతన సీసీటీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ బుధ‌వారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలలో 220 సీసీటీవీ కెమెరాలు గ్రామీణ ప్రాంతాలలో, 80 సీసీటీవీ కెమెరాలు పట్టణ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసారు. ఈ కెమెరాల ద్వారా ప్రజల రక్షణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేరాల నివారణ, నిందితుల గుర్తింపు వంటి అంశాలలో పోలీసు శాఖకు మరింత సహకారం అందనుంది.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా , మల్టీజోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , అదనపు ఎస్పీ మౌనిక , ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి , ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐ బి. సునీల్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.