- డ్రైనేజీ ఆక్రమణల పై జూన్ 14 డెడ్ లైన్.
- ‘మహా పత్రిక ‘ కధనానికి అధికారుల స్పందన.
- దమ్మపేట సుందరీకరణ లో ప్రజల భాగస్వామ్యం అవసరం.
- సామాజిక భాద్యత -అందరి భాద్యత.
- గ్రామప్రజలకు ప్రకటన చేసిన సర్పంచ్ తీరు హర్షణీయం.
దమ్మపేట ,మహా :
మే 26 వతేదీన ‘మహా పత్రిక ‘ లో ప్రచురించిన “డ్రైనేజీ ఆక్రమణల పై అధికారుల ఉదాసీనత ” కధనానికి పంచాయతీ అధికారులు ,పాలకులు స్పందించారు. మహా పత్రిక వాస్తవాలను ,ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టిలో ,అధికారుల ,పాలకుల దృష్టికి తీసుకురావడంలో ముందంజలో ఉంటుందనే విషయాన్ని గ్రహించిన అధికారులు ,పాలకులు శుక్రవారం స్పందించారు. గ్రామంలో బహిరంగంగా మైక్ ప్రచారం కొనసాగించారు. దమ్మపేట పట్టణ కేంద్రంలో లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డ్రైనేజీలు నేడు వ్యాపారుల కబంధ హస్తాలలో ఆక్రమణకు గురికావడం ఎంతవరకూ సహేతుకంగా లేదని భావించిన పంచాయతీ కార్యదర్శి అనంత్ కుమార్ ,సర్పంచ్ పగడాల రమాదేవి సీరియస్ గా స్పందించారు. డ్రైనేజీ లపై ఉన్న షాపులను ,అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ,అందుకు జూన్ 14 వరకు అంటే ఆదివారం వరకు సమయం ఇచ్చినట్లు బహిరంగ మైక్ ప్రచారంలో తెలిపారు.
పట్టణసుందరీకరణ లో ప్రజల భాగస్వామ్యం అవసరం .
దమ్మపేట పట్టణాన్ని సుందరీకరణ గా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ,అదే క్రమంలో స్వచ్చందంగా ఎవరికి వారే సామాజిక భాద్యతను గుర్తుచేసుకొని డ్రైనేజీ లను ఖాళీ చేయాలని కోరారు. ఒక సక్రమమైన పనిని చేపట్టేముందు కొందరికి తాత్కాలికంగా బాధ కలగడం సహజమే ఐనప్పటికీ చట్టం ముందు , నిబంధనల ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే భావం ప్రతి ఒక్కరిలో ఉండాలని అధికారులు ,పంచాయతీ సర్పంచ్ తో సహా పాలకులు కోరారు. ప్రజా సహకారం లేనిదే ఏ కార్యక్రమం ముందుకు సాగదని భావిస్తూ మంచి కార్యక్రమాలకు అందరూ బాసటగా ఉంటారని ఆశిస్తున్నామని పాలకవర్గ సబ్యులు తెలిపారు.
సామాజిక బాద్యత – అందరి బాద్యత :
పట్టణంలో పాడుబడిన ఇండ్లను జనావాసాల మధ్యన వదిలి , గృహ యజమానులు ఇతర ప్రాంతాల లో నినసిస్తున్నట్లైతే స్వచ్చందంగా ఎవరికి వారే సామాజిక బాద్యతతో తొలగించి మరొకరికి కష్టం లేకుండా చేయాలని పంచాయతీ అధికారులు వెల్లడించారు. శిధిలావస్ధలో ఉన్న గృహాలలో పాములు ,విషపూరిత జంతువులు ,కోతులకు ఆవాసాలుగా మారడమే కాకుండా నిశబ్ద రాత్రి సమయాలలో దొంగలకు కూడా నిలయాలుగా మారుతున్నాయని గ్రామప్రజలనుండి విమర్శలు వస్తున్నట్లు పాలకులు వాపోతున్నారు. కాబట్టి నిరుపయోగంగా ఉన్న ఇండ్లను ఎవరికి వారే తొలగించుకుంటే పంచాయతీ ఆదాయాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. లేదంటే పంచాయతీ ధనంతో కూల్చివేత లు చేస్తే అధనంగా పంచాయతీ పై ఆర్ధిక భారం పడే అవకాశం ఉంటుందని పాలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపైన వ్యక్తిగత కోపతాపాలకు తావివ్వకుండా ప్రజా సౌకర్యార్దం చేసే అభివృద్ధి పనులకు అందరి చేయూత అవసరం ఉందని పాలకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే వర్షాకాలం నాటికి డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నదే పంచాయతీ లక్ష్యం గా ముందుకు సాగే ప్రయత్నంలో ప్రజలు సహకరించాలని పాలకులు కోరుతున్నారు.
———————–








