Mahaa Daily Exclusive

  మహా పత్రిక కథనానికి స్పందించిన గ్రామ సర్పంచ్…

Share

  • తుమ్మల వాగులో వ్యర్ధాలు తొలగింపు
  • మహా పత్రిక కథనానికి స్పందించిన గ్రామ సర్పంచ్
  • కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

జూలూరుపాడు, మహా:

మండల పరిధి పడమట నర్సాపురం, బేతాళపాడు మార్గమధ్యంలోని తుమ్మల వాగు లో వ్యర్ధాలను శుక్రవారం తొలగించారు. గురువారం మహా పత్రికలో ప్రచురించిన వార్త కథనానికి వెంటనే స్పందించిన నర్సాపురం గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి జెసిబి సహాయంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ కుమారి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. గ్రామ ప్రజలందరూ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, గ్రామంలోని డంపింగ్ యార్డ్ కు తరలించాలని సూచించారు. ఇకపై గ్రామ సమీపంలో రోడ్ల వెంబడి గాని, బహిరంగ ప్రదేశాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యర్ధాలను పడేసినట్లు తమ దృష్టికి వస్తే జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. స్వచ్ఛత, ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీ గా తీర్చిదిద్దే దానిలో గ్రామస్తులందరూ తమకు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యను గుర్తించి పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన మహా పత్రిక కు, వార్తా కథనానికి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన గ్రామ సర్పంచ్ కి నర్సాపురం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.