Mahaa Daily Exclusive

  ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం…

Share

  • ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం
  • నోట్ల కట్టలపైనే ఆ అధికారి నిద్ర
  • రూ. 200 కోట్ల ఆస్తులు కూడబెట్టిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌
  • సుంకరి నరహరి నివాసంతో పాటు 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు
  • ఇంట్లో పట్టుబడ్డ రూ. 1.40 కోట్ల నగదు

హైదరాబాద్, మహా : ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. గత కొన్ని నెలలుగా అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ అధికారులు మరో పెద్ద తిమింగలాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో నివసిస్తున్న ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగలు, నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. మంగళవారం ఉదయం నుంచి సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్ ఛత్రినాకలోని సుంకరి నరహరి ఇంటితోపాటు ఆయన కార్యాలయం, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు ఇలా మొత్తం 11 ప్రాంతాల్లో ఒకే సమయంలో దాడులు చేశారు. ఈ క్రమంలోనే సుంకరి నరహరి ఇంట్లో ఆయన బెడ్రూంలో ఉన్న బెడ్డు కింద రూ.1.40 కోట్ల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదే విధంగా కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే భారీ మొత్తంలో నగదును ఎందుకు ఉంచాల్సి వచ్చిందన్న అంశఁపై ఏసీబీ అధికారులు శఅరీధర్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో దొరికిన బంగారు ఆభరణాలు, డబ్బు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. సుంకరి నరహరితోపాటు ఆయన సోదరుడి ఇంట్లో భారీగా ఆస్తిపత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాంతాల్లో ఓపెన్‌ ప్లాట్లతోపాటు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు విచారణలో వెల్లడైంది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలోని స్పెషల్ టీమ్స్ ఈ సోదాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు దొరికిన ఆధారాల ప్రకారం ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి ఆస్తులు.. రూ.200 కోట్లకు పైనే ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నరహరి నివాసంలో బ్యాంక్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లు కూడా దాదాపు రూ. కోటి వరకు ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరించారు. నరహరి పేరు మీద రెండు బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించామన్నారు. వీటిని తనిఖీ చేసేందుకు అనుమతి కోసం బ్యాంకు‌కు లేఖ రాశామన్నారు. రెండు మూడు రోజుల్లో ఆ లాకర్లు ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం నరహరి నివాసంలో ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు విలువ రూ. 5 కోట్ల ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తులు విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఆయన వివరించారు. సోదాలు పూర్తయి, ఆస్తుల వివరాలపై కొంత స్పష్టత వచ్చిన తర్వాత నరహరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇటీవల డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కే. వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు భారీ దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా హైదరాబాద్ సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. గతంలో శేరిలింగంపల్లి ఆర్డీవోగా పనిచేసిన సమయంలో వంశీ మోహన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం, మ్యుటేషన్ల కోసం రియల్టర్ల నుండి తన బంధువుల పేర్లపై 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ల రూపంలో ముడుపులుగా తీసుకోవడం వంటి కీలక అక్రమాలను అధికారులు గుర్తించి, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.