Mahaa Daily Exclusive

  ఖచ్చితమైన ఓటరు జాబితాతోనే ప్రజాస్వామ్య బలోపేతం: మన్నె గోవర్ధన్ రెడ్డి

Share

ఖైరతాబాద్, మహా :

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర డివిజన్ దేవరకొండ బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సంఘం బీఎల్ఓ రేష్మ బేగం, బీఎల్ఏ ఖలీల్ భాయ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని స్పష్టం చేశారు. మరణించినవారి పేర్లను తొలగించడం, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను సకాలంలో సరిచేయడం వంటి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా అనేది ఎన్నికల ప్రక్రియకు అసలైన పునాది అని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందే పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సయ్యద్ ఫయాజ్, ఎండీ ఫయాజ్ తాహెర్ మరియు దేవరకొండ బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.