Mahaa Daily Exclusive

  తెలంగాణలోనూ సర్ గడువు పొడిగింపు…

Share

  • తెలంగాణలోనూ సర్ గడువు పొడిగింపు
  • ఆగస్టు 3 ఆఖరు తేదీ అని ప్రకటించిన ఈసీ
  • కొత్త షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసీ

హైదరాబాద్, మహా : తెలంగాణలో ఎస్ఐఆర్ ( ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్ ను ఈసీ బుదవారం విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు చేపట్టే ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

సవరించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. బీఎల్ఓల ఇంటింటి సర్వే ఆగస్టు 3, 2026 వరకు పొడిగించిన ఈసీ పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణను ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ ఆగస్టు 10 న విడుదల చేస్తారు. క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణను ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలపవచ్చు లేదా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. క్లెయిములు, అభ్యంతరాలను ఆగస్టు 10 నుండి అక్టోబర్ 8, 2026 లోపు వీటిని అధికారులు పరిష్కరిస్తారు. ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 12 న అధికారికంగా విడుదల చేస్తారు. సవరించిన షెడ్యూల్ సమాచారాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఈ మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని స్పష్టం చేశారు. ఓటు హక్కు లేని వారు, మార్పులు చేర్పులు చేయాలనుకునే వారు ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest